
'ఆర్ఎస్ఎస్ లోకి మహిళలను తీసుకోండి'
ఆర్ఎస్ఎస్ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆలయాల్లో స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు.
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆలయాల్లో స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు. మహిళల ఓట్లుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆర్ఎస్ఎస్ కూడా తమ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆమె అన్నారు.
ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. స్త్రీ,పురుష సమాన హక్కుల కోసం మోహన్ భాగవత్ మద్దతు కోరతామన్నారు. తృప్తి దేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే.