రైల్వేల్లో ఆర్పీఎఫ్‌ టికెట్ల తనిఖీకి చెల్లుచీటీ

RPF personnel not to check passengers' ticket

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల టికెట్లను రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్‌) సిబ్బంది ఇకపై తనిఖీ చేయరాదని ఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ధర్మేంద్ర కుమార్‌ ఆదేశించారు. ఇటీవల టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆర్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యత్నించి దుర్మరణం చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు అన్ని రైల్వే జోనల్‌ కార్యాలయాలకు కుమార్‌ లేఖ రాశారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యవేక్షణాధికారిని ఇందుకు బాధ్యునిగా చేస్తామని హెచ్చరించారు. రైల్వే చట్టం ప్రకారం టికెట్ల తనిఖీతో పాటు అదనపు చార్జీలు విధించడం టికెట్‌ తనిఖీ బృందాలకు సంబంధించిన విషయమని కుమార్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top