బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు: సోనియా అల్లుడు | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు: సోనియా అల్లుడు

Published Sun, Aug 28 2016 2:19 PM

బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు: సోనియా అల్లుడు - Sakshi

డెహ్రాడూన్: పోలీసు గుర్రం ‘శక్తిమాన్’  చావుకు కారణమైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తనపై నోరు పారేసుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీని ఆహ్వానించేందుకు తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి.. తన మీదకు దూసుకొచ్చి బెదిరించారని వాద్రా ఆరోపించారు.

‘మీరు దౌర్జన్యం చేస్తున్నా మాట్లాడకపోవడానికి నేను గుర్రాన్ని కాదు. మూగజీవం కాబట్టి గుర్రం మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడగలన’ని జోషికి సమాధానం ఇచ్చినట్టు రాబర్ట్ వాద్రా తెలిపారు. జోషిని ఆయన అనుచరులు విమానాశ్రయం బయటకు తీసుకెళ్లారని చెప్పారు. డెహ్రాడూన్ లో మార్చిలో బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడంతో ‘శక్తిమాన్’  మరణించిన తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement