రాకీ యాదవ్ కు గన్‌లంటేనే పిచ్చి! | Road rage 'killer' Rocky Yadav loved guns, his Facebook profile suggests | Sakshi
Sakshi News home page

రాకీ యాదవ్ కు గన్‌లంటేనే పిచ్చి!

May 11 2016 12:05 PM | Updated on Aug 30 2018 3:51 PM

రాకీ యాదవ్ కు గన్‌లంటేనే పిచ్చి! - Sakshi

రాకీ యాదవ్ కు గన్‌లంటేనే పిచ్చి!

తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ఓ యువకుడిని కాల్చి చంపిన బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గురించి ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు

పాట్నా: తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ఓ యువకుడిని కాల్చి చంపిన బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గురించి ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు. అతడి అభిరుచులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు క్యూ కట్టారు. మే 7నుంచి ఇప్పటి వరకు బిహార్లో ఫేస్ బుక్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి రంజన్ యాదవ్ అని.. మంగళవారం సాయంత్రం నాటికి ఫేస్ బుక్ ద్వారా అతడి గురించి 1,44,287సార్లు తెలుసుకునేందుకు క్లిక్ చేశారు.

మే 7న రాత్రి రంజన్ యాదవ్ ఓ స్కూల్ యువకుడిని తన తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లంతా అతడి సమాచారం కోసం వివిధ పేర్లతో వెతకడం మొదలు పెట్టారు. రాకేశ్ రంజన్ యాదవ్ పేరిట 53,748మంది, రాకీ యాదవ్ పేరిట 69,789 మంది, రాకీ యాదవ్ గయా పేరిట 20,750 మంది అతడి గురించి తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ద్వారా వెతికాడు. అయితే, అతడి ప్రొఫైల్ లో అతడి వివరాలేమి కనిపించలేదు. కానీ, కొన్ని ఫొటోల్లో మాత్రం కండల వీరుడిగా కనిపించాడు. ఈ తుపాకులతో పలుసార్లు పోజిచ్చి కనిపించాడు. దీని ప్రకారం అతడికి తుపాకులంటే చాలా ఇష్టమని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement