పోలీసుకు బెదిరింపులు.. ఎమ్మెల్యేపై కేసు | RJD MLA booked for threatening police officer | Sakshi
Sakshi News home page

పోలీసుకు బెదిరింపులు.. ఎమ్మెల్యేపై కేసు

Nov 23 2015 6:36 PM | Updated on Aug 28 2018 7:24 PM

పోలీసుకు బెదిరింపులు.. ఎమ్మెల్యేపై కేసు - Sakshi

పోలీసుకు బెదిరింపులు.. ఎమ్మెల్యేపై కేసు

బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే మీద పోలీసు కేసు నమోదైంది.

బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే మీద పోలీసు కేసు నమోదైంది. భోజ్‌పూర్ జిల్లాలోని చార్ పోఖ్రి పోలీసు స్టేషన్‌లోని ఎస్‌హెచ్ఓను ఫోన్‌లో తీవ్రంగా బెదిరించినందుకు ఎమ్మెల్యే సరోజ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బర్హరా నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన యాదవ్.. ఓ కేసు విషయంలో సదరు అధికారికి ఫోన్ చేశారు.

ఆ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన జంట హత్యల విషయంలో కేసు నమోదు చేయనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాగైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారని ఎస్పీ నవీన్ చంద్ర ఝా తెలిపారు. దీంతో ఎమ్మెల్యేపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఎస్‌హెచ్‌ఓకు ఫోన్ చేసి బెదిరించలేదని ఎమ్మెల్యే సరోజ్ యాదవ్ అంటున్నారు. పైపెచ్చు, తననే ఆ పోలీసు అధికారి తిట్టారని, బెదిరించారని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement