నోబెల్ అవార్డు తిరస్కరించా! | Refused the Nobel Prize! | Sakshi
Sakshi News home page

నోబెల్ అవార్డు తిరస్కరించా!

May 4 2016 1:45 AM | Updated on Oct 17 2018 4:36 PM

నోబెల్ అవార్డు  తిరస్కరించా! - Sakshi

నోబెల్ అవార్డు తిరస్కరించా!

నోబెల్ అవార్డు వచ్చిందంటే ఎగిరి గంతేసే వారెవరుండరు? కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ మాత్రం తనకు ఈ అవకాశం వస్తే తిరస్కరించినట్లు వెల్లడించారు.

న్యూఢిల్లీ: నోబెల్ అవార్డు వచ్చిందంటే ఎగిరి గంతేసే వారెవరుండరు? కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ మాత్రం తనకు ఈ అవకాశం వస్తే తిరస్కరించినట్లు వెల్లడించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించిన రవిశంకర్.. పాకిస్తాన్ బాలిక మలాలాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం అర్థరహితమన్నారు. ‘మీకు నోబెల్ అవార్డు ఇస్తే స్వీకరిస్తారా?’ అని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నాకెప్పుడో ఆ అవకాశం వచ్చింది.

కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు పనిచేయటంలోనే సంతృప్తి ఉంటుంది. నేను చేసిన పనికి అవార్డులు రావాలని ఎప్పుడూ కోరుకోలేదు’ అని చెప్పారు.2006లో న్యూయార్క్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఓ సభ్యుడు రవిశంకర్‌ను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయాలని కోరారు. అయితే దీనికి నోబెల్ కమిటీ ఒప్పుకుందా? లేక రవిశంకర్‌ను అడిగితే ఆయన తిరస్కరించారా అనే దానిపై స్పష్టత లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement