రావణుడు నోయిడాలో పుట్టాడు: సుబ్రమణ్యస్వామి | Ravana was not a Dravidian like Karunanidhi, born in Noida | Sakshi
Sakshi News home page

రావణుడు నోయిడాలో పుట్టాడు: సుబ్రమణ్యస్వామి

Sep 24 2018 5:29 AM | Updated on Sep 24 2018 5:29 AM

Ravana was not a Dravidian like Karunanidhi, born in Noida - Sakshi

పణజి: రావణుడు ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జన్మించాడనీ, తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి చెప్పినట్లు ఆయన ద్రవిడ రాజు కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలిపారు. నోయిడా ప్రాంతంలోని బిస్రఖ్‌లో రావణుడు పుట్టాడనీ, ప్రస్తుతం ఈ ఊరు జాతీయ రాజధాని ప్రాంతం ఉందని వెల్లడించారు. దక్షిణ గోవాలో ఓ సమావేశంలో మాట్లాడుతూ..‘రావణుడికి సంబంధించిన చిత్ర పటాలు, ఆలయాలు బిస్రఖ్‌లో ఇంకా ఉన్నాయి. మానససరోవర్‌లో తపస్సు చేసిన రావణుడు శివుడిని మెప్పించి వరాలు పొందాడు. శ్రీలంకను పాలిస్తున్న సోదరుడు కుబేరుడిని ఓడించి లంకాధిపతిగా మారాడు’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement