అరుదైన పాము లభ్యం

జయపురం: జయపురం ప్రాంతానికి పాముల స్వర్గమని పేరు. ప్రజ లకు ఇక్కడ అనేక రకాల పాములు కనిపిస్తాయి. పాముల జాతిలో అరుదైన పహడి సుందరి(పర్వత సుందరి)గా స్థానికులకు పరిచయమైన పహడి సుందరి జయపురంలో శుక్రవారం లభ్యమైంది.
వన్యప్రా ణి సురక్షా సమితి జయపురం ప్రతినిధి కృష్ణ కైలాశ్ షడంగి జయపురం డివిజన్ పరిధిలో గల జయపురం ఫారెస్ట్ రేంజ్ పాత్రోపుట్ ఫారెస్ట్ సెక్షన్ జబకనడి గ్రామంలో దీనిని పట్టుకున్నారు. ఇది అపురూపమైన పాము అని ఆయన తెలిపారు. అరుదైన ఈ పామును సమీప అడవి లో భద్రంగా విడిచిపెట్టామని ఆయన తెలిపారు. ఎటువంటి పామునైనా, వన్యప్రాణినైనా చంపవద్దని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని అందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుచేత వన్యప్రాణులను రక్షించేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి