స్వైన్‌ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి | Rajasthan: Mandalgarh BJP MLA Kirti Kumari dies of swine flue | Sakshi
Sakshi News home page

స్వైన్‌ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి

Published Mon, Aug 28 2017 9:52 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

స్వైన్‌ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి

సాక్షి, జైపూర్ ‌: రాజస్థాన్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్‌ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్‌ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.
 
అర్థరాత్రి తర్వాత శ్వాస తీసుకోలేకపోతుండటంతో కిర్తీని వెంటీలేటర్‌పై ఉంచారు. కాగా, సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే కిర్తీ కుమారి అకస్మిక మరణంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2013లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 83 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Advertisement
 
Advertisement
 
Advertisement