రాబర్ట్‌ వాద్రాకు చుక్కలు చూపిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం! | Rajasthan govt cancelled land agreement of Vadra's firm | Sakshi
Sakshi News home page

రాబర్ట్‌ వాద్రాకు చుక్కలు చూపిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం!

Jan 4 2015 5:37 PM | Updated on Sep 2 2017 7:13 PM

రాబర్ట్‌ వాద్రా

రాబర్ట్‌ వాద్రా

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు రాజస్థాన్‌ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

జైపూర్: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు రాజస్థాన్‌ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ లిమిటెడ్‌ కంపెనీ బికనీర్‌లో కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించే ఒప్పందాన్ని రద్దు చేసింది. మొత్తం 360 హెక్టార్ల భూమికి ఇది వర్తిస్తుంది.

ఈ భూములను రైతుల నుంచి అక్రమంగా రాబట్టుకున్నారని వాద్రా సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని వసుంధరా రాజే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement