'పౌరసత్వ చట్టం నచ్చని వారు సముద్రంలోకి దూకండి'

Rajasthan BJP MLA Madan Dilawar Controversial Comments On CAA - Sakshi

జైపూర్‌: జాతీయ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలిపేవారంతా దేశానికి శత్రువులేనంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ దేశంలో అల్లర్లు, ఆందోళనలు సృష్టించి దేశానికి సంబంధించిన ఆస్తుల్ని తగలబెడుతున్నవారంతా దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చదవండి: రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా!

జాతీయ పౌరసత్వ చట్ట సవరణ నచ్చకుంటే అలాంటి వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు. లేదంటే బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్ ఇలా.. వారికి నచ్చిన దేశానికి వెళ్లిపోండి. ఆ దేశాలు ఒప్పుకోకుంటే హిందూ మహా సముద్రంలో దూకండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నచ్చకపోతే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అయినా సరే వేరే దేశాలకు వెళ్లిపోవచ్చని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ దేశంలో నివసించే హక్కు లేదని మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు.

చదవండి: 'సీడీఎస్‌గా భవిష్యత్‌ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావ‌త్‌'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top