రైళ్లలో ఆహారం పనికిరాదు | Railways serving food unfit for humans, says CAG report | Sakshi
Sakshi News home page

కాగ్‌ సంచలనం: రైళ్లలో ఆహారం పనికిరాదు

Jul 21 2017 9:07 AM | Updated on Sep 22 2018 8:48 PM

రైళ్లలో ఆహారం పనికిరాదు - Sakshi

రైళ్లలో ఆహారం పనికిరాదు

రైళ్లలో ప్రజలకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వ్యాఖ్యానించింది.

న్యూఢిల్లీ: రైళ్లలో ప్రజలకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వ్యాఖ్యానించింది. పాడైపోయిన ఆహారం, రీ-సైక్లిడ్‌ ఫుడ్‌, ప్యాక్లెట్లలో ఉంచిన ఆహారం, గుర్తింపు లేని కంపెనీల వాటర్‌ బాటిల్స్‌ తదితరాలు ప్రయాణీకలకు రైల్వే అందిస్తోందని కాగ్‌ తన రిపోర్టులో పేర్కొంది.

ఈ రిపోర్టును శుక్రవారం పార్లమెంటులో కాగ్‌ సమర్పించనుంది. రైల్వే ఆహారపు పాలసీని తరచూ మారుస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగ్‌, భారతీయ రైల్వేకు చెందిన అధికారులు సంయుక్తంగా 74 స్టేషన్లు, 80 రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో ఆహారం తయారుచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదని తెలిసిందని కాగ్‌ చెప్పింది. ఆహారం కొనుగోలు చేసిన ప్రయాణీకులు బిల్లులు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది.

ట్యాప్‌ల నుంచి నీటిని పట్టి అమ్మేస్తున్నారని రిపోర్టులో పేర్కొంది. బెవరేజెస్‌, చెత్త కుండీలకు మూతలు ఉండటం లేదని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement