ఎఫ్‌ఐడీలతో ముప్పులేదు: కేంద్రం | Rail unions oppose FDI plan, say strategic network could be at risk | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐడీలతో ముప్పులేదు: కేంద్రం

Jul 23 2014 3:09 AM | Updated on Oct 4 2018 5:15 PM

రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించడం వల్ల ఏ ముప్పూ లేదని కేంద్రం స్పష్టం చేసింది. హైస్పీడ్ రైళ్లు, రవాణా కారిడార్లు వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య

రైల్వే బడ్జెట్‌కు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించడం వల్ల ఏ ముప్పూ లేదని కేంద్రం స్పష్టం చేసింది. హైస్పీడ్ రైళ్లు, రవాణా కారిడార్లు వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానం అవసరమని రైల్వే మంత్రి సదానంద గౌడ మంగళవారం రాజ్యసభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చలో అన్నారు. సామాన్యుడిపై భారం పడకుండా ఎఫ్‌డీఐ, పీపీపీల ద్వారా బులెట్ రైళ్ల ప్రాజెక్టులు చేపడతామన్నారు.

ఎఫ్‌డీఐలను మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం చేస్తామని, స్పష్టం చేశారు. తమ రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదని పలువురు సభ్యులు చర్చలో ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వడంతో కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదని గౌడ సమాధానమిచ్చారు. చర్చ తర్వాత సభ రైల్వే బడ్జెట్‌ను మూజువాణి ఓటుతో ఆమోదించింది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement