‘మరో 24 గంటలు అప్రమత్తం’

 Rahul Tells Congress workers To Remain Alert And Cautious - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై తమ అభ్యర్ధనను సుప్రీం కోర్టు, ఈసీ తోసిపుచ్చిన నేపథ్యంలో మరో 24 గంటల పాటు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కోరారు. రానున్న 24 గంటలు అత్యంత కీలకమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలు భయానికి లోనుకావాల్సిన అవసరం లేదని, మీరు సత్యం కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను నమ్మరాదని, నకిలీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంతో నిరాశపడరాదని, కాంగ్రెస్‌ పట్ల, మీ పట్ల విశ్వాసం ఉంచాలని, మీ శ్రమ వృధా కాబోదని పార్టీ శ్రేణుల్లో రాహుల్‌ ధైర్యాన్ని నూరిపోశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌తో నిరుత్సాహానికి గురికావద్దని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఆడియో సందేశంలో పార్టీ శ్రేణులను కోరారు. స్ర్టాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, మన కృషి ఫలితాలను ఇస్తుందని తాను నమ్ముతున్నానని ప్రియాంక పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top