‘రఫేల్‌ చర్చను పక్కనపెట్టి లెక్చర్లు ఇస్తున్నారు’

Rahul Says PM Ran Away To Lovely University   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో రఫేల్‌ ఒప్పందంపై చర్చ జరుగుతుంటే పారిపోయిన ప్రధాని పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. రఫేల్‌పై జరుగుతున్న కీలక చర్చలో పాల్గొనకుండా ప్రధాని పంజాబ్‌ పారిపోయారని గురువారం రాహుల్‌ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఫేల్‌పై చర్చలో పాల్గొనకుండా ప్రధాని వర్సిటీ విద్యార్ధులకు లెక్చర్లు ఇస్తున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ గురువారం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించి అనంతరం గురుదాస్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు.

కాగా, ప్రధానికి తాను నిన్న సంధించిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని మోదీని కోరాలని విద్యార్ధులను రాహుల్‌ కోరడం గమనార్హం. రఫేల్‌ ఒప్పందంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మోదీ సర్కార్‌పై రాహుల్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాహుల్‌ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top