ఆయన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీలకు కాపలాదారు..

Rahul Says PM Narendra Modi Not Your Chowkidar But Of Anil Ambanis And Nirav Modis   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ దూకుడు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కాపలాదారు కాదని, ఆయన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, విదేశాలకు పారిపోయిన ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీలకు కాపలాదారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. రాజస్ధాన్‌లోని శ్రీగంగా నగర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి రాహల్‌ మాట్లాడుతూ రైతులు, నిరుగ్యోగ యువత ఇంటికి కాపలాదారును ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తాను కాపలాదారునని చెప్పుకొంటారు..కానీ ఆయన ఎవరికి కాపలాదారో (చౌకీదార్‌) మాత్రం చెప్పరని అన్నారు. మోదీ మీకు కాపలాదారు కాదని,ఆయన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ వంటి వారికి కాపలాదారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌ ఇటీవల బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ మీరెప్పుడైనా దేశంలో సామాన్యుడి ఇంటి ఎదుట కాపలాదారును చూశారా అని ప్రశ్నించారు. ప్రధాని సంపన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని ఆక్షేపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top