మోదీ సర్కార్‌పై రాహుల్‌ ఫైర్‌

Rahul Gandhis Fresh Attack On PM Over Ladakh - Sakshi

శాటిలైట్‌ ఫోటోలే సాక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో గతవారం భారత్‌, చైనా సేనలు తలపడిన గల్వాన్‌ లోయలో శాటిలైట్‌ ఫోటోలను పరిశీలిస్తే ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చూపుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. చైనా సేనలు మన భూభాగంలోకి రాలేదని, మన పోస్టులను ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష భేటీలో చెప్పిన దానికి విరుద్ధంగా శాటిలైట్‌ ఇమేజ్‌లు ఉన్నాయని రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. కాగా, శాటిలైట్‌ చిత్రాల్లో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలకు పదిరోజుల ముందే గల్వాన్‌ ప్రాంతానికి 200కి పైగా ట్రక్కులు, బుల్డోజర్లు, ఇతర పరికరాలను తరలించినట్టు వెల్లడైంది.

చదవండి : ప్రధాని వ్యాఖ్యలకు వక్రభాష్యాలు.. పీఎంవో స్పష్టత!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top