రాహుల్ ప్రధాని కావాలి: షిండే | rahul Gandhi should become next Prime Minister: Shinde | Sakshi
Sakshi News home page

రాహుల్ ప్రధాని కావాలి: షిండే

Oct 10 2013 9:19 PM | Updated on Sep 1 2017 11:31 PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని హోంమంత్రి సుశీల్ కుమార్‌షిండే అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని హోంమంత్రి సుశీల్ కుమార్‌షిండే అన్నారు. గురువారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో యువత చేతుల్లోకే అధికారంలోకి వస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘అవును. ఆయన సరిగ్గా చెప్పారు. మా కోరిక కూడా అదే. రాహుల్‌ను దేశ ప్రధానిగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు..’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో యువతదే అధికారమని ప్రకటించిన రాహుల్ వ్యాఖ్యలపై షిండే ను ప్రశ్నించగా తాము కూడా అదే కోరుకుంటున్నామని తెలిపారు.

 

దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి యువతకు అధికారమివ్వాలని రాహుల్ వ్యాఖ్యనించిన తెలిసిందే. 2014 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అప్పుడు కూడా పేదలు, సామాన్య ప్రజల ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. యువకులతో కూడిన ప్రభుత్వం వస్తుంది. అది దేశ గతినే మార్చేస్తుంది. ప్రతి ఒక్కరూ సాధికారత సాధించేలా మార్పును తీసుకొస్తుంది’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement