‘ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి’

Rahul Gandhi Demands PM Modis Response On Trumps Kashmir Claim - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని తక్షణమే స్పందించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని మోదీ తూట్లు పొడిచారని ఆయన ట్వీట్‌ చేశారు. కశీ​‍్మర్‌ విషయంలో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య వివాద పరిష్కారానికి ప్రధాని మోదీ తనను చొరవ చూపాలని కోరారని ట్రంప్‌ చెబుతున్నారని ఇదే నిజమైతే ప్రధాని దేశ ప్రయోజనాలను, 1972 సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడిచినట్టేనని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్‌తో తాను ఏం మాట్లాడిందీ ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌, ఇత ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమ్మని ఎలా అడుతుతారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top