ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన

Radium Collars To Save Cows From Accidents In Panchkula - Sakshi

హరియాణ: పశువులను సంరక్షించాలనే తపనతో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితె.. సర్వ్‌ కాంట్రాక్టర్‌ సం​గ్‌ (ఎస్‌సీఎస్‌), రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(ఆర్‌వీఏ) అనే స్వచ్ఛంద సంస్థలు హరియాణాలోని పంచకులలో రోడ్డు ప్రమాదాల నివారణకు, మూగజీవాల పరిరక్షణకు సరికొత్త పంథా ఎంచుకున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఆవులు, కుక్కల మెడల్లో రేడియం టేపులు కట్టారు. ఇప్పటి వరకు  హైవేలోని 150 ఆవులకు  రేడియం టేపులు కట్టామని నిర్వాహకులు తెలిపారు.

ఎస్‌సీఎస్ ప్రెసిడెంట్‌ రవీందర్‌ జజారియా మాట్లాడుతూ.. జంతువులు, రాత్రి వేళ బైక్‌ నడిపే ప్రజలకు రక్షణ కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ‘పొగ మంచు వల్ల వాహనదారులకు జంతువులు కనిపించవు కనుక.. మంచు కురిసే చోట్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. అందుకనే రేడియం టేపుల ఆలోచన వచ్చింది. నాణ్యమైన రేడియం టేపులు ధరించిన జంతువులు వాహనాదారులకు దూరం నుంచి కనిపిస్తాయి. దాంతో వారు జాగ్రత్త పడొచ్చు. కోయంబత్తూరు నుంచి టేపులను కొనుగోలు చేస్తున్నామ’ని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top