కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం ఖరారైందా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారా?
రంగంలోకి దిగనున్న ప్రియాంకా గాంధీ
Jul 3 2016 7:22 PM | Updated on Aug 25 2018 5:02 PM
మీరట్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం ఖరారైందా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారా?సంప్రదాయబద్ధంగా అమేథి, రాయ్ బరేలిల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వస్తున్న ప్రియాంక ఇప్పటి వరకూ ఎవరూ ప్రచారం చేయని విధంగా ఏకంగా 150 ర్యాలీల్లో ప్రసంగిస్తారని ఆపార్టీ ఉత్తరప్రదేశ్ ప్రతినిధి సత్యదేవ్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. 2017 ఎన్నికల్లో ప్రియాంక ప్రధాన పాత్రను పోషించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం హైకమాండ్ స్థాయిలో పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement