మథుర ఘర్షణల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని పరశురాంపుర ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం అరెస్టు చేశారు.
బస్తీ: మథుర ఘర్షణల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని పరశురాంపుర ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం అరెస్టు చేశారు. చందన్ బోస్, అతని భార్యను కైత్ వాలియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున మథుర పోలీసుల టీమ్ అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్ సింగ్ తెలిపారు. మథుర ఘర్షణలకు కారణమైన ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కు అధ్యక్షుడిగా పనిచేసిన రామ్ వృక్ష్ యాదవ్ కు బోస్ ప్రధాన అనుచరుడు. కాగా, యాదవ్ మథుర గొడవల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ దల్జీత్ సింగ్ రామ్ వృక్ష్ యాదవ్, చందన్ బోస్, గిరీశ్ యాదవ్, రాకేశ్ గుప్తాలను కేసులో నేరస్తులుగా ప్రకటించిన విషయం విదితమే. జూన్ 2న మథురలోని జవహార్ బాగ్ వద్ద జరిగిన ఈ ఘర్షణలో మథుర ఎస్పీ, స్టేషన్ హోస్ ఆఫీసర్ లతో పాటు మొత్తం 29 మంది మరణించారు.