ఉక్కుమనిషికి ఘన నివాళి.. | President Ramnath Kovind And Amit Shah Tribute To Sardar vallabhai Patel | Sakshi
Sakshi News home page

ఉక్కుమనిషికి ఘన నివాళి..

Oct 31 2019 8:11 AM | Updated on Oct 31 2019 10:35 AM

President Ramnath Kovind And Amit Shah Tribute To Sardar vallabhai Patel - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన గల పటేల్‌ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా నివాళి అర్పించారు. పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ  మైదానంలో అమిత్‌ షా సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పటేల్‌ను స్మరించుకున్నారు. ‘సంఘటితత్త్వంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమని నమ్మి 565 గణరాజ్యాలను ఒక్కటి చేసి సువిశాల భారతదేశాన్ని నిర్మించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్య భారత నిర్మాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement