
ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
ప్రస్తుత ఎంపీల సంతకాలు, తన ప్రసంగంతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్‌కు సుమిత్రా మహాజన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అందరికీ ప్రణబ్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఆయన నిండునూరేళ్లు ఆయురాగ్యోగాలతో ఉండాలని ఆకాంక్షించారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రణబ్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు.