చీకట్లో విద్యుత్ మంత్రి | Power Cut During Union Power Minister's Press Conference in Delhi | Sakshi
Sakshi News home page

చీకట్లో విద్యుత్ మంత్రి

May 20 2016 6:31 PM | Updated on Sep 4 2017 12:32 AM

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. శుక్రవారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. తన శాఖ సాధించిన విజయాలను, నరేంద్రమోదీ నాయకత్వంలోని తమ ప్రాధాన్యతలను వివరిస్తున్నారు.

ఈ సమయంలో ఉన్నంట్టుండి ఒక్కసారిగా పవర్ కట్ అయింది. మంత్రి కాసేపు చీకట్లోనే కూర్చున్నారు. తరువాత మళ్లీ పవర్ వచ్చిన తర్వాత ఆయన తమ శాఖ సాధించిన విజయాలపై బుక్ లెట్ ను విడుదల చేశారు.
 
   
 
 

Advertisement
 
Advertisement
Advertisement