ప్రవాసీ దివస్‌కు అతిథిగా పోర్చుగీసు ప్రధాని | Portuguese PM to be chief guest at Pravasi Bharatiya Divas | Sakshi
Sakshi News home page

ప్రవాసీ దివస్‌కు అతిథిగా పోర్చుగీసు ప్రధాని

Nov 22 2016 11:51 AM | Updated on Sep 4 2017 8:49 PM

ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్టా హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ: జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా భారతీయ మూలాలున్న పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్టా హాజరుకానున్నారు. రచయిత అయిన ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు.

గతేడాది పోర్చుగీసు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియా అక్కడి లిస్బన్‌ నగరంలో 1961లో జన్మించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 8న భారతీయ దివస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంటోనియో అంగీకరించారని విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement