లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు | Police officers caught dancing in work areas | Sakshi
Sakshi News home page

లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు

Dec 27 2014 11:17 AM | Updated on Aug 21 2018 5:46 PM

లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు - Sakshi

లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు

యూనిఫాంలో ఉన్న ఓ ఎస్‌ఐ ... ఆ విషయమే మర్చిపోయాడు. ఎదురుగా ఓ ఛమక్‌ ఛల్లో కనిపించగానే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయ్.

*యూనిఫాంలోనే ఉంటారు .. కానీ డ్యూటీ చేయరు ...
*ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం కూడా ఉండదు ...
*మ్యూజిక్‌ ఆన్ అయితే చాలు ... అటోమెటిక్‌గా స్టెప్పులేసేస్తారు ...
*ఇక అమ్మాయి తోడైతే ... ఒళ్లు మరచిపోతారు ...
*ఆ నిషాలో ... ఒక్కోసారి ఎక్స్‌ట్రాలు చేస్తుంటారు, ఆనక ఉద్యోగాలు పోగొట్టుకుంటారు.
* అలాంటి స్పెషల్ డాన్స్‌ ఛమ్మక్కులే .... ఈ 'ఏసేయ్‌ రా జజ్జనక జజ్జనక'.



యూనిఫాంలో ఉన్న ఓ ఎస్‌ఐ ... ఆ విషయమే మర్చిపోయాడు. ఎదురుగా ఓ ఛమక్‌ ఛల్లో కనిపించగానే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయ్. అంతే ... అక్కడే సెటిలైపోయాడు. లంచాలు వసూలు చేస్తే వచ్చిన డబ్బులో ఏమో .. ఇష్టానుసారంగా డాన్సర్‌పై కరెన్సీ వెదజల్లాడు. ఇక ఆగలేక ఏకంగా అతడు కూడా స్టెప్పులేయడం మొదలెట్టాడు. ఈ సూపర్బ్ సీన్ గుజరాత్‌లో జరగ్గా ... ఓ పోలీస్ వీరాభిమాని మొబైల్‌లో రికార్డ్ చేశాడు.

*ఈయనే కాదు ఈమధ్య ఇలాంటి పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉత్తర్ ప్రదేశ్ సుజ్జహాన్ పూర్లో ఓ పోలీస్ ఆఫీసర్ .. రికార్డింగ్ డాన్సర్‌ డాన్స్ చేస్తుంటే .. ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు. యూనిఫాంలో ఉండి ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడినందుకు ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు.

*ట్రైనింగ్ కోసం వచ్చిన లేడీ కానిస్టేబుల్‌కు రాజస్థాన్‌ అజ్మీర్‌లోని బేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఎలాంటి శిక్షణ ఇచ్చారో తెల్సుకుంటే ... దిమ్మ తిరగడం ఖాయం. పోలీసింగ్‌పై పాఠాలు నేర్పాల్సిందిపోయి ఏకంగా ఐటమ్ సాంగ్స్‌పై డాన్స్ చేయించారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌ సింగ్‌ ఈ నిర్వాకాన్ని వెలగబెట్టగా .. మిగిలిన వారు అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

*హర్యానాలోనూ సేమ్ సీన్. ఓ పోలీస్ అధికారికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్‌ఫర్ అయ్యినందుకుగానూ ఓ ఫేర్‌వెల్‌ పార్టీ అరేంజ్ చేశారు. అక్కడి వరకూ ఓకేగానీ .. ఆ పార్టీలో రికార్డింగ్ డాన్సర్లతో డాన్స్ చేయించడమే అందరికీ పెద్ద ఝలఖ్ ఇచ్చింది.

*ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అందరి సంగతేమోగానీ .. పోలీస్ స్టేషన్‌ను స్టేజ్ చేసుకుని, హుషారుగా డాన్స్ చేయడంలో ఢిల్లీ పోలీస్ తర్వాతే ఎవ్వరైనా.  షారూక్‌ఖాన్‌కు పోటీనిచ్చారు ...లుంగీలు కట్టకపోయినా ఆ రేంజ్‌లో అదరగొట్టారు ...అవును, పోలీసులు కింగ్ ఖాన్‌ డాన్స్‌ను కాపీ కొట్టారు.

*మహిళల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పోలీస్ బాసులు, లేడీ కొలీగ్స్‌తో ఇదిగో ఇలా చెలరేగిపోయారు. ఈ డాన్స్ హంగామాలో ... ముంబై రైల్వే పోలీస్‌, బాంద్రా జోన్‌ ఏసిపి ఎస్ ఎస్.బిజ్వే స్పెషల్ ఎట్రాక్షన్‌ కాగా .. ఆయనతో పాటు మరికొందరు లుంగీ డాన్స్ చేశారు.
 
*అసలే హోలీ ... ఆపై తాగిన పోలీస్ బాబాయిలు, ఇంకేముంది పోలీస్ స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ఖాకీలు, ఖైదీలు అన్న తేడా లేకుండా అందరూ తీన్ మార్ స్టెప్పులేసేశారు. ఇక మీరట్ పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా? బంగ్ తాగి .. బంగీ జంప్స్ చేశారు. నేరస్థులతో కలిసి నాచ్‌గానాలో పాల్గొన్నారు. మీడియా ఎంట్రీ ఇవ్వడంతో ... సీన్ లోంచి మెల్లిగా జారుకున్నారు.

*అలాని కేవలం మగమహారాజులే ఇలా ఆన్ డ్యూటీలో చిందులేస్తారనుకుంటే పొరపాటే. గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లేడీ పోలీస్‌లు కాసేపు ఆటపాటలతో రీఛార్జ్ అయ్యారు. అది స్టేషన్ అని, తాము యూనిఫాంలో ఉన్నామని .. అస్సలంటే అస్సలూ పట్టించుకోకుండా ... పండగ చేసుకున్నారు.

*డాన్స్ అంటే పంజాబీలు ప్రాణమిస్తారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ ఆఫీసు వేళల్లో డాన్స్ అంటేనే రియాక్షన్ వేరుగా ఉంటుంది. కానీ ఆ పంజాబీ ఖాకీలు రూల్స్‌ని లైట్ తీసుకున్నారు. స్టేషన్‌లోనే డాన్స్ సెటప్ పెట్టేశారు. అలాని అందరు పోలీసులు ఇలానే ఉంటారని కాదుగానీ .. ఇలాంటి గంజాయి మొక్కలు, తులసి వనంలో ఉంటే మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు రావడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement