చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ | Police encounters three maoists in bijapur | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్

Dec 15 2016 6:17 PM | Updated on Oct 9 2018 2:53 PM

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. పర్సగూడ పరిధిలోని కులంగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
 
సంఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రితో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు దళ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement