పేద కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ | PMUY to be launched at Ballia in Uttar Pradesh; | Sakshi
Sakshi News home page

పేద కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్

Apr 22 2016 4:01 PM | Updated on Aug 15 2018 2:20 PM

దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

న్యూఢిల్లీ: దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టనుంది. మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు వంట గ్యాస్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించనున్నారు.  

5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కలెక్షన్లను రానున్న మూడేళ్లలో పేద కుటుంబాలకు కల్పించన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పేదరిక రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు 1.5 కోట్ల  గ్యాస్ కలెక్షన్లను  కల్పించనున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement