గోపిచంద్పై మోదీ ప్రశంసల జల్లు | pm narendra modi praises gopichand | Sakshi
Sakshi News home page

గోపిచంద్పై మోదీ ప్రశంసల జల్లు

Published Sun, Aug 28 2016 12:04 PM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

గోపిచంద్పై మోదీ ప్రశంసల జల్లు - Sakshi

గోపిచంద్పై మోదీ ప్రశంసల జల్లు

బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అని, ఒక మంచి టీచర్ ఏం చేయగలరో ఆయన నిరూపించాడని అన్నారు.

న్యూఢిల్లీ: బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అని, ఒక మంచి టీచర్ ఏం చేయగలరో ఆయన నిరూపించాడని అన్నారు. గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందిన పీవీ సింధూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో వెండిపతకాన్ని తీసుకొచ్చి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గోపిచంద్ ను ఓ క్రీడాకారుడిగా కంటే టీచర్ గా గుర్తిస్తేనే మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు. ఒలింపిక్స్ లో ఇండియన్ డాటర్స్ మంచి విజయాలు అందించారిన పొగిడారు.

ఈ సందర్భంగా పీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులకు మోదీ అభినందనలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలు స్పృషించారు. గంగా నది శుభ్రత కోసం ముందుకొచ్చి గొప్ప ప్రమాణం చేసిన నదీ పరిహవాక ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మోదీ మురుగునీటిని గంగానదిలోకి వదిలేయడం వెంటనే ఆపేయాలని కోరారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, గణేశ్, దుర్గా ఉత్సవాలకు మట్టితో చేసిన వినాయకులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ మిళిత రసాయనలతో చేసిన విగ్రహాలను వాడొద్దని చెప్పారు. దేశ ప్రజలందరిలో ఐక్యతా భావం పురికొల్పేందుకు నాడు బాలగంగాదర్ తిలక్ ఈ గణేశ్ ఉత్సవాలు ప్రారంభించారని గుర్తు చేశారు.

ఇక భారత రత్న మదర్ థెరిసాను కూడా ప్రధాని మోదీ జ్ఞప్తికి తెచ్చారు. ఆమె సేవలు అపురూపం అని కొనియాడారు. ఈ సెప్టెంబర్ 4న ఆమెను దైవ దూత(సెయింట్ హుడ్)గా ప్రకటించనున్నారని, ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గౌరవంగా భావించాలని చెప్పారు. ఇక కశ్మీర్లో ఆందోళనకర పరిస్థితులపై కూడా మాట్లాడిన మోదీ అక్కడి యువతను రెచ్చగొడుతున్న వారు వారికి సరైన సమాధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ లో ఒక్క ప్రాణనష్టం జరిగినా అది దేశం మొత్తానికి నష్టం జరిగినట్లేనని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి యువత అనవసర ప్రలోభాలకు గురికావొద్దని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement