పుణే నర్సుకి ప్రధాని ఫోన్‌  | PM Narendra Modi Phone To Pune Nurse Over Coronavirus | Sakshi
Sakshi News home page

పుణే నర్సుకి ప్రధాని ఫోన్‌ 

Mar 29 2020 6:53 AM | Updated on Mar 29 2020 6:57 AM

PM Narendra Modi Phone To Pune Nurse Over Coronavirus - Sakshi

పుణే: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రోగులకు సేవలందిస్తున్నారు. వారిలో మనోధైర్యం నింపడం కోసం మహారాష్ట్ర పుణేలోని స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న నాయుడు ఆసుపత్రిలో ఒక నర్సుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. వారి మధ్య మరాఠీలో జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.  నర్సు ఛాయా జగతాప్‌కు ఫోన్‌ చేసిన మోదీ ముందుగా ఆమె క్షేమసమాచారాలు వాకబు చేశారు. (ఏపీలో మరో ఆరు కరోనా పాజిటివ్‌)

జగతాప్‌ కుటుంబ సభ్యులు ఆమె గురించి ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె వినయంగా సమాధానమిచ్చారు. పవిత్రమైన నర్సు వృత్తిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉన్నప్పటికీ రోగులకు సేవలందించడమే తమ కర్తవ్యమని తెలిపారు. వృత్తి పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని ప్రధాని ప్రశం సించారు.  (తెలంగాణలో తొలి కరోనా మరణం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement