జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు.
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. మ్యునిక్ లో జరిగిన దాడి భీతిని కొల్పిందని, దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు.
శుక్రవారం మునిక్ లోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో గల ఒలింపియా షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణకాండలో పదిమంది చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించలేదు. మరో 22 మంది గాయపడ్డారు.