త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ | PM Modi Meets three Service Chiefs | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

Feb 27 2019 9:55 PM | Updated on Feb 27 2019 9:56 PM

PM Modi Meets three Service Chiefs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌- పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో బుధవారం త్రివిధ దళాధిపతులు మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై ఆరా తీశారు. సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులను రావత్ మోదీకి వివరించారు. భారత పైలట్ అభినందన్ క్షేమంపై కూడా మోదీ ఆరాతీశారని సమాచారం. పాక్‌ కబంధ హస్తాల్లో చిక్కున్న భారత పైలట్‌ను క్షేమంగా, త్వరగా విడిపించే అంశంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దులో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రధాని వారితో చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement