మోదీతో నేపాల్‌ ప్రధాని భేటీ | PM Modi meets KP Sharma Oli in Delhi | Sakshi
Sakshi News home page

మోదీతో నేపాల్‌ ప్రధాని భేటీ

Apr 7 2018 3:24 AM | Updated on Aug 15 2018 2:37 PM

PM Modi meets KP Sharma Oli in Delhi - Sakshi

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్‌ చేరుకున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేపాల్‌ రాయబార కార్యాలయంలో నేపాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ స్వాగతం పలికారు.

ఓలి శనివారం ప్రధాని మోదీతో ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఉన్న జీబీ పంత్‌ వ్యవసాయ, సాంకేతికత యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడి సంకరణ విత్తనాల ఉత్పత్తి కేంద్రం, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అదే యూనివర్సిటీ ఓలికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement