ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి | PM Modi launches Sansad Adarsh Gram Yojana | Sakshi
Sakshi News home page

ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి

Oct 11 2014 11:35 AM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి - Sakshi

ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.  శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా దేశంలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రూపొందించిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ... ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందుకోసం తన నియోజకవర్గంలోని ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని... ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలా 2016 నాటికి దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను తయారు చేయాలని ఆకాంక్షించారు. 

కేంద్ర, రాష్ట్రాలు, ఎంపీ ల్యాడ్స నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 1915లో విదేశాల నుంచి స్వదేశం వచ్చిన మహత్మ గాంధీ గ్రామాభివృద్ధికి పాటపడిన తీరును మోడీ వివరించారు. అలాగే గ్రామాల హక్కుల కోసం గాంధీజి పోరాడిన తీరును కూడా ఈ సందర్భంగా మోడీ విశదీకరించారు. గ్రామాభివృద్ధికి గాంధీజీయే మనకు స్పూర్తి ప్రధాత అని అన్నారు. పేదలు, రైతుల కోసమే గ్రామ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించినట్లు చెప్పారు. పేదల అభివృద్దే మన ప్రధాన కల కావాలని మోడీ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement