breaking news
Sansad Adarsh Gram Yojna
-
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన
-
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన
నెల్లూరు: భారతరత్న, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారం పుట్టంరాజువారి కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సచిన్‌కు ఉన్నతాధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పిలికారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఏర్పాటు చేసిన సచిన్ శిలఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ... గ్రామస్తులను పలకరిస్తున్నారు.అందులోభాగంగా స్థానిక చెరువులో చేపలు వదిలి మీనోత్సవాన్ని సచిన్ ప్రారంభించారు. గ్రామంలో రూ.2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సచిన్ పర్యవేక్షించనున్నారు. పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా సచిన్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు. సచిన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రతి ఎంపీ ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
న్యూఢిల్లీ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా దేశంలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రూపొందించిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ... ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందుకోసం తన నియోజకవర్గంలోని ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని... ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలా 2016 నాటికి దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను తయారు చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాలు, ఎంపీ ల్యాడ్స నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 1915లో విదేశాల నుంచి స్వదేశం వచ్చిన మహత్మ గాంధీ గ్రామాభివృద్ధికి పాటపడిన తీరును మోడీ వివరించారు. అలాగే గ్రామాల హక్కుల కోసం గాంధీజి పోరాడిన తీరును కూడా ఈ సందర్భంగా మోడీ విశదీకరించారు. గ్రామాభివృద్ధికి గాంధీజీయే మనకు స్పూర్తి ప్రధాత అని అన్నారు. పేదలు, రైతుల కోసమే గ్రామ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించినట్లు చెప్పారు. పేదల అభివృద్దే మన ప్రధాన కల కావాలని మోడీ ఆకాంక్షించారు.