21న జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

PM Modi To Address Nation On 21st June For International Yoga day - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని లద్దాఖ్‌లోని లేహ్‌ నుంచి చేయాలని మొదట నిర్ణయించారు. కానీ, కోవిడ్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యోగా విశిష్టత గురించి ఆయన వివరిస్తారని సమాచారం. అలాగే ప్రధాని చేసే కొన్ని యోగాసనాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా మోదీ ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్‌ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.    
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top