మోదీ భద్రత కోసం ప్రత్యేక సొరంగ మార్గం | PM To Have His Own Tunnel To Move From Residence To Parliament | Sakshi
Sakshi News home page

మోదీ భద్రత కోసం ప్రత్యేక సొరంగ మార్గం

Feb 5 2020 5:40 PM | Updated on Feb 5 2020 6:18 PM

PM To Have His Own Tunnel To Move From Residence To Parliament  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంకు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఈపీటీ) యూనివర్శిటీలో సమావేశం జరిగింది. ప్రధాని నివాసం నుంచి ఆయన కార్యాలయానికి, పార్లమెంటు భవనంకు ప్రత్యేక రహదారిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ ఒక ప్రత్యేక టన్నెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని పార్లమెంటు భవనంకు లేదా అతని కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్‌‌ను క్లియర్ చేసేందుకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దీంతో పార్లమెంటు భవనంకు కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. తద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి వీవీఐపీలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రధాని వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు వెళ్లే సమయంలో సామాన్యులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం నిత్యం మనం చూస్తునే ఉన్నాం. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు. పైగా వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా వీలవుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement