లాక్‌డౌన్‌ వదంతులపై ప్రధాని స్పష్టత | Pm Clarifies On Another Lockdown Proposal | Sakshi
Sakshi News home page

మరోసారి లాక్‌డౌన్‌ ఉండదు

Jun 17 2020 7:24 PM | Updated on Jun 17 2020 7:50 PM

Pm Clarifies On Another Lockdown Proposal - Sakshi

లాక్‌డౌన్‌ వదంతులను తోసిపుచ్చిన ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అన్‌లాక్‌ 1.0 సాగుతోందని, అన్‌లాక్‌ 2.0 ఎలా అమలుచేయాలనే దానిపై చర్చించాలని ప్రధాని మోదీ సీఎంలతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరగా ప్రధాని ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కరోనా కట్టడికి టెస్టింగ్‌ల సామర్థ్యం పెంచడంతో పాటు ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని ప్రధాని కోరారు.

చదవండి: టెస్టింగ్‌ సామర్థ్యం పెరగాలి

Advertisement
 
Advertisement
Advertisement