మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ | Petroleum minister M. Veerappa Moily took a metro ride to office | Sakshi
Sakshi News home page

మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ

Oct 9 2013 1:28 PM | Updated on Oct 16 2018 5:07 PM

మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ - Sakshi

మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ బుధవారం మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లారు. పెట్రోలియం పొదపు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ బుధవారం మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లారు. పెట్రోలియం పొదపు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రేసు కోర్సు స్టేషన్ వద్ద రైలెక్కి సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద దిగారు. ఇక్కడికి సమీపంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఉంది.

'ప్రతీ బుధవారం నేను రైల్లోనే ఆఫీసుకు వెళతా. నా అధికారిక వాహనాన్ని గ్యారెజిలో ఉంచాల్సిందిగా సిబ్బందికి సూచించా. వారంలో కనీసం ఒకసారి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణం చేయాల్సిందిగా పెట్రోలియం శాఖ పరిధిలోని కంపెనీల ఉద్యోగులకు సలహా ఇచ్చా' అని మంత్రి చెప్పారు. పెట్రోల్ను పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఆదా చేసినట్టేనని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement