మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి | Petrol bombs hurled at my house, says J-K education minister Naeem Akhtar | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

Aug 2 2016 4:16 PM | Updated on Jul 11 2019 5:07 PM

మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి - Sakshi

మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు దాడులు చేశారని జమ్మూకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ అన్నారు.

జమ్మూకశ్మీర్: తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు దాడులు చేశారని జమ్మూకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ అన్నారు. శ్రీనగర్ లోని పర్రే పోరా ప్రాంతంలోని ఆయన నివాసంపై రెండు పెట్రోల్ బాంబులు విసిరారని ఆయన స్వయంగా మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటికి ఎవరి భద్రత లేదు.

నయీమ్ తన కుటుంబ సభ్యులతో సహా ఎవరూ ఈ దాడి జరిగినప్పుడు ఇంట్లో లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంత్రి నయీమ్ గుప్కార్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాలో ఉంటున్నారు. గత నెల(జూలై 8)న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భారత భద్రత బలగాలు చంపేసిన అనంతరం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement