 
															పెట్రోల్ పై రూ. 2.19 పెంపు
పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు రూ. 2.19 పెరిగి రూ. 61.87 కి చేరింది.
	 98 పైసలు పెరిగిన డీజిల్
	న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు రూ. 2.19 పెరిగి రూ. 61.87 కి చేరింది. డీజిల్ 98 పైసలు పెరిగి రూ. 49.31కి చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ప్రకటించింది. సోమవారం అర్థరాత్రి నుంచి తాజా ధరలు అమల్లోకి వచ్చాయి. మార్చి 17న పెట్రోలు ధరను రూ. 3.07, డీజిల్ ధరను రూ. 1.90 పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓసీ పేర్కొంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
