హీరో సూర్యకు పెటా సారీ | PETA sorry to hero Surya | Sakshi
Sakshi News home page

హీరో సూర్యకు పెటా సారీ

Jan 29 2017 3:00 AM | Updated on Sep 5 2017 2:21 AM

హీరో సూర్యకు పెటా సారీ

హీరో సూర్యకు పెటా సారీ

తమిళ హీరో సూర్యకు పెటా (ద పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ అనిమల్స్‌) ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి పూర్వా జోషిపురా క్షమాపణలు చెప్పారు.

చెన్నై: తమిళ హీరో సూర్యకు పెటా (ద పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ అనిమల్స్‌) ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి పూర్వా జోషిపురా క్షమాపణలు చెప్పారు. సూర్య కేవలం తన రాబోయే చిత్రం ఎస్‌3 (ఇప్పుడు సీ3గా పేరు మర్చారు) ప్రచారం కోసమే జల్లికట్టును సమర్థిస్తున్నారని గతంలో పూర్వ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా సూర్య తన లాయర్‌ ద్వారా ఆమెకు నోటీసులు జారీ చేయించారు. దీంతో క్షమాపణలు కోరుతూ సూర్య లాయర్‌కు ఆమె ఒక లేఖ పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement