ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ | People have put their stamp on alliance: Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ

Aug 26 2014 2:45 PM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ - Sakshi

ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ

తాజా బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తమ కూటమి విజయం దక్కడంపై ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.

పాట్నా: తాజా బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తమ కూటమి విజయం దక్కడంపై ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జెడీ, జేడీ(యూ), కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు అని వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయానికి ఆందించడానికి కొత్త శకం మొదలైందని ఆయన అన్నారు. బీహార్ లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఈ కూటమి 6 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో కార్యకర్తలు పొంగిపోకూడదని, పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని లాలూ పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement