బలహీన నాయకత్వం వల్లే ఓటమి | People don't like weak rulers: Sharad Pawar | Sakshi
Sakshi News home page

బలహీన నాయకత్వం వల్లే ఓటమి

Dec 10 2013 12:39 AM | Updated on Mar 18 2019 9:02 PM

బలహీన నాయకత్వం వల్లే ఓటమి - Sakshi

బలహీన నాయకత్వం వల్లే ఓటమి

ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కాంగ్రెస్ నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నవ తరం ఓటర్లతో పాటు బలహీనులైన, నిర్ణయూలు తీసుకోలేని పాలకులు కూడా కారణమేనన్నారు.

 న్యూఢిల్లీ: ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కాంగ్రెస్ నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. నాలుగు రాష్ట్రాల  ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నవ తరం ఓటర్లతో పాటు బలహీనులైన, నిర్ణయూలు తీసుకోలేని పాలకులు కూడా కారణమేనన్నారు. యువత తన ఆగ్రహాన్ని బ్యాలెట్ ద్వారా ప్రదర్శించిందన్నారు. ‘‘దివంగత ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకులు, నిర్ణయూలు తీసుకోగలిన నేతలే యువతకు కావాలి. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన నిర్ణయూలెన్నో ఆమె తీసుకున్నారు. ప్రజలకు బలమైన, ఫలితాలు చూపించగలిగిన నేతలు కావాలి. పేదల కోసం విధానాలు, కార్యక్రమాలు రూపొందించి వాటిని దృఢచిత్తంతో అమలు చేయగలిగిన నేతల్ని వారు కోరుకుంటున్నారు. పాలకుల్లో విశ్వాసం లోపించినప్పుడే ఇతర అధికార కేంద్రాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు.
 
  ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం ఇదే’’ అని పవార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోరుున కాంగ్రెస్‌తో పాటు తాము కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమయ్యూయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవాలతో సంబంధం లేని నకిలీ కార్యకర్తలు తలెత్తడానికి కూడా ఈ బలహీన నాయకత్వమే కారణమంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అన్నారు. మీడియూతో పాటు ప్రభుత్వంలోని వారు కూడా వారి (ఆప్) ప్రభావానికి లోనయ్యూరన్నారు. ‘బలమైన, నిర్ణయూలు తీసుకోగలిగిన నాయకత్వం ఉన్నప్పుడు ఇలాంటి శక్తులు ఎన్నడూ ముందుకు రావు. ఇందిర హయూంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఉత్పన్నం కాలేదు’ అన్నారు.
 
  ఇప్పట్లా ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలిచ్చేందుకు సదా సిద్ధంగా ఉండే నేతలు అప్పుడు లేరంటూ కాంగ్రెస్ కోటరీకి చురకలు పెట్టారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం తర్వాత నోరు విప్పిన తొలి యూపీఏ భాగస్వామ్య పక్ష నేత పవారే కావడం గమనార్హం. అయితే పవార్ విమర్శలను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది. తమ భాగస్వామ్య పక్షాల గురించి మీడియూ ముందు మాట్లాడబోమని, సరైన వేదికపైనే మాట్లాడతామని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ అన్నారు.
 
 కేజ్రీవాల్‌కు పవార్ సవాల్: ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా పవార్ ధ్వజమెత్తారు. అధికారం చేపట్టి ధరలు తగ్గించాలని కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. ‘‘అవినీతిరహిత ఢిల్లీ కోసం ఏఏపీ పిలుపుకు స్పందించి ఓట్లు వేస్తున్నవారే మరోవైపు తమ చట్టవిరుద్ధమైన కాలనీలను చట్టబద్ధం చేయూలని డిమాండ్ చేస్తున్నారు. అసలు పేదలకు, మధ్యతరగతికి అరవింద్ కేజ్రీవాల్ ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు.
 
 పవార్ తృతీయ కూటమిలో చేరాలి: ఎస్పీ
 ప్రజలకు సమర్థవంతమైన నాయకత్వం కావాలంటూ పవార్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ స్వాగతించింది. ఆయన తృతీయ కూటమిలో చేరితే.. అది కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవుతుందని వ్యాఖ్యానించింది. ‘‘శరద్‌జీ వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం. ఆయన్ను తృతీయ కూటమిలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. పవార్‌జీ మూడో కూటమిలో చేరితే నేతాజీ(ములాయంసింగ్ యాదవ్)తో కలిసి కాంగ్రెస్, బీజేపీలకు ఓ ప్రత్యామ్నాయాన్ని ఈ దేశానికి అందించే అవకాశం ఉంటుంది’’ అని ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement