మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్‌ మందు కాదు!

Patanjali U Turn On Covid 19 Medicine Claims Says No Such Medicine Made - Sakshi

ఉత్తరఖాండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంటు నోటీసులకు బదులిచ్చిన పతంజలి కంపెనీ

డెహ్రాడూన్‌: మహమ్మారి కరోనాకు మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్‌ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్‌’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు కరోలిన్‌ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా గురువు రాందేవ్‌ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(పతంజలి‍ ప్రధాన కేంద్రం)‌లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ పేర్కొంది.(పతంజలి ‘కరోలిన్‌’పై పెను దుమారం)

ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనిల్‌ ప్రకటనలను భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్‌ మందుకు అనుమతించామని పేర్కొంది. ఈ క్రమంలో కరోలిన్‌ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌ పతంజలి సంస్థకు నోటీసులు జారీచేసింది.(మార్కెట్‌లోకి కరోనా ఔషధం..!)

ఈ విషయంపై మంగళవారం స్పందించిన కంపెనీ.. ‘‘‘కరోనా కిట్‌’ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య అను టేల్‌ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్‌ చేస్తున్నాం. కరోనిల్‌ కిట్‌ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపాం. కేవలం ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాల గురించి మాత్రమే వెల్లడించాం. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు’’ అని పేర్కొంది. అయితే అది దగ్గు మందా లేదా మరే ఇతర ఔషధమా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-07-2020
Jul 12, 2020, 07:57 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 06:12 IST
కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటికే కీలకమైన సమాచారం పరిశోధనల ద్వారా తెలిసి నా.. తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు...
12-07-2020
Jul 12, 2020, 05:49 IST
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు...
12-07-2020
Jul 12, 2020, 05:21 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
12-07-2020
Jul 12, 2020, 04:32 IST
న్యూఢిల్లీ:   చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌...
12-07-2020
Jul 12, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నాలుగు రోజుల నుంచి వెయ్యి దాటుతోంది. గడిచిన 24...
12-07-2020
Jul 12, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: కరోనా రాకుండా తనను తాను కాపాడుకోవడం ఒకటైతే.. వచ్చాక కోలుకునే వరకూ జాగ్రత్తలు తీసుకోవడం మరొకటి. అయితే.....
12-07-2020
Jul 12, 2020, 03:52 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్‌...
12-07-2020
Jul 12, 2020, 03:40 IST
వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో ఏకంగా 71,787 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు...
12-07-2020
Jul 12, 2020, 03:06 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ...
12-07-2020
Jul 12, 2020, 02:53 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 బాధితుల సంఖ్య...
12-07-2020
Jul 12, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న...
11-07-2020
Jul 11, 2020, 19:41 IST
సాక్షి, ముంబై : కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్‌ అధికారి...
11-07-2020
Jul 11, 2020, 18:04 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన...
11-07-2020
Jul 11, 2020, 17:59 IST
బీజింగ్‌:  కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా...
11-07-2020
Jul 11, 2020, 14:34 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 12 మిలియన్ల మంది మహమ్మారి బారిన పడగా.....
11-07-2020
Jul 11, 2020, 12:52 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు...
11-07-2020
Jul 11, 2020, 11:20 IST
సాక్షి కడప : కడప ఎయిర్‌ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో మార్పులు చేశారు. ఎప్పటికప్పుడు సీజన్ల...
11-07-2020
Jul 11, 2020, 11:00 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు 8 లక్షలకు చేరి రికార్డు సృష్టించగా.. 24 గంటల్లో 27 వేల కేసులు నమోదవడం...
11-07-2020
Jul 11, 2020, 10:05 IST
సాక్షి, అమలాపురం టౌన్‌: దాపరికంతో చేసిన నిర్లక్ష్యమే అతని నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవడం,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top