నేపాల్ భూకంప మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహజన్.... సంతాప తీర్మానం చదివి వినిపించారు.
న్యూఢిల్లీ : నేపాల్ భూకంప మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహజన్.... సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్ రాజధాని ఖట్మాండు కేంద్రంగా నమోదైన భూ కంపం వేలాది మంది ప్రాణాలు బలితీసుకుందని...మరెంతో మందిని గాయాలపాలు చేసిందని అందులో పేర్కొన్నారు. భూ కంప తీవ్రత నేపాల్‌తో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పడిందని అన్నారు. జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని... తీవ్ర ఆవేదనకు గురిచేసిందని స్పీకర్ తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని...నేపాల్ దేశం త్వరలోనే కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించారు.
అటు రాజ్యసభ కూడా నేపాల్ మృతులకు సంతాపం ప్రకటించింది. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ హమిద్ అన్సారీ... సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్ రాజధాని ఖట్మాండ్ కేంద్రంగా నమోదైన భూ కంపం....తీవ్ర ప్రభావం చూపిందని, ఇలాంటి సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని అందులో పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని...త్వరగా నేపాల్ తిరిగి కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులందరూ కొద్దిసేపు మౌనం పాటించారు.