సీఏ‌పీఎఫ్ క్యాంటీన్లు: ఇక‌పై స్వ‌దేశీ ఉత్ప‌త్తులు మాత్ర‌మే

Paramilitary Canteens: Only Made In India Products Will Be Sold From June 1 - Sakshi

న్యూఢిల్లీ: పారామిలిట‌రీ(సీఏపీఎఫ్) క్యాంటీన్ల‌లో ఇక నుంచి‌ కేవ‌లం స్వ‌దేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ ఆదేశాలు జూన్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. దీంతో ఇక‌పై  సీఏపీఎఫ్ క్యాంటీన్ల‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తులు మాత్రమే ల‌భించ‌నున్నాయి. నిన్న(మంగ‌ళ‌వారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంద‌రూ స్థానిక‌ వస్తువులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధ‌వారం ట్వీట్ చేశారు. (ర‌ష్యా అద్యక్షుడి అధికార ప్ర‌తినిధికి క‌రోనా )

'మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ భార‌తీయులంతా స్థానిక ఉత్ప‌త్తుల‌పైన‌ దృష్టి పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నిర్ణ‌యం భార‌త్‌ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయ‌క‌త్వ మార్గంలోకి తీసుకెళుతుంది. సుమారు 10 లక్షల మంది సీఏపీఎఫ్‌ సిబ్బందితోపాటు వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించ‌నున్నారు'. అని తెలిపారు. కాగా క‌రోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊత‌మిచ్చేందుకు  ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. (కరోనా పాడుగాను.. ఎంత కష్టమొచ్చే )

పారామిలిటరీ క్యాంటీన్లు ప్ర‌తి ఏటా రూ .2,800 కోట్ల అమ్మకాలను జ‌రుపుతున్నాయి. సీఏపీఎఫ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సాశాస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్‌బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎన్‌‌జీ)తోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వీరంతా భారతదేశంలో తయారైన వ‌స్తువుల‌ను ప్రజలు ఉపయోగించాలని, ఇతరులు కూడా ఇలాగే చేయాల‌ని హోంమంత్రి కోరారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top