సీఎం వివరణ ఇవ్వాలి: స్టాలిన్‌ | Panneerselvam should explain Rama Mohana Rao Comments: MK Stalin | Sakshi
Sakshi News home page

సీఎం వివరణ ఇవ్వాలి: స్టాలిన్‌

Dec 27 2016 3:00 PM | Updated on Sep 4 2017 11:44 PM

సీఎం వివరణ ఇవ్వాలి: స్టాలిన్‌

సీఎం వివరణ ఇవ్వాలి: స్టాలిన్‌

ఇప్పటికీ తానే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అంటూ పి.రామ్మోహనరావు చేసిన వ్యాఖ్యలపై ఎంకే స్టాలిన్‌ స్పందించారు.

చెన్నై: ఇప్పటికీ తానే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అంటూ సీనియర్‌ ఐఏఎస్ అధికారి పి.రామ్మోహనరావు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని అన్నారు. ఇప్పటికే తానే సీఎస్‌ గా ఉన్నానని రామ్మోహనరావు చెబుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆదాయపన్ను శాఖ కేంద్రం పరిధిలో ఉంటుందని, ఐటీకి సొంతంగా అధికారులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో గతంలోనూ ఐటీ సోదాలు జరిగాయని స్టాలిన్‌ పేర్కొన్నారు. జయలలిత తనను ప్రధాన కార్యదర్శిగా నియమించారని, తను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని రామ్మోహనరావు అంతకుముందు అన్నారు. జయలలిత బతికుంటే తన ఇ‍ల్లు, కార్యాలయంలోకి ఐటీ అధికారులు ప్రవేశించేవారా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement