కశ్మీర్‌లో హింసకు రహస్య కోడ్‌

Pakistan army using codes via FM transmission to contact terterrorists in J&K - Sakshi

ఎల్వోసీ వద్ద ఎఫ్‌ఎం స్టేషన్లను ఏర్పాటుచేసిన పాక్‌

దాయాది కుట్రను పసిగట్టిన భారత నిఘావర్గాలు  

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు పాక్‌ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు కోడ్‌ భాషలో రహస్య సందేశాలను పంపుతున్నట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇందుకోసం పలు ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్లను ఎల్వోసీ సమీపానికి పాకిస్తాన్‌ తరలించించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్‌లో దాడులు చేయాలంటూ ఈ కేంద్రాల ద్వారా స్థానిక ఉగ్రవాదులకు సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించారు.

సంప్రదింపుల కోసం ఉగ్రసంస్థలు జైషే మొహమ్మద్‌(68/69), లష్కరే తోయిబా(ఏ3), అల్‌ బద్ర్‌(డీ9) సంకేతాలను వాడుతున్నాయని చెప్పారు. సైన్యం, ఉగ్రసంస్థలు పాకిస్తాన్‌ జాతీయ గీతమైన ‘క్వామీ తరానా’ ద్వారా సందేశాలు పంపుతున్నాయని నిఘావర్గాలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని గత నెల 5న రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఎల్వోసీ వెంట ఈ తరహా సందేశాలు పెరిగిపోయాయి. ఇందుకోసం దాయాది దేశం ఎల్వోసీతో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో వెరీ హైఫ్రీక్వెన్సీ రేడియో స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top